ఆంధ్రప్రదేశ్‌

ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, మార్చి 22: తన సహ చిరుద్యోగి బిల్లులు ఖజనా కార్యాలయానికి సమర్పించడానికి రూ.11వేలు లంచం తీసుకుంటున్న ఐసీడీఎస్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి నాగేశ్వరరావు డిప్యుటేషన్‌పై కోయలగూడెం కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత రుణం, లీవ్ సరెండర్‌కు సంబంధించి సుమారు రెండు లక్షల రూపాయల మేర బిల్లులు పూర్తిచేసి, స్థానిక ఉపఖజానా కార్యాలయంలో అందించడానికి కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి సత్యనారాయణ మూర్తి రూ.15వేలు లంచం డిమాండుచేశాడు. చివరకు బిల్లులు మంజూరయ్యాక రూ.11వేలు ఇవ్వడానికి ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం బిల్లులు సమర్పించడం, మంజూరవ్వడం, నగదుగా మార్చుకోవడం జరిగింది. దీనితో ముందు కుదర్చుకున్న ఒప్పందం మేరకు రూ.11వేలు ఇవ్వాలని సత్యనారాయణమూర్తి డిమాండ్ చేయసాగాడు. దీన్ని తట్టుకోలేని నాగేశ్వరరావు రాజమహేంద్రవరంలో ఏసీబీ అధికార్లను ఆశ్రయించారు. ఈమేరకు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో నాగేశ్వరరావునుంచి రూ.11వేలు లంచం తీసుకుంటున్న సత్యనారాయణమూర్తిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏసీబీ డిఎస్పీ సుధాకర్ తెలిపారు.
పెద్దారవీడు తహశీల్దార్ సస్పెన్షన్
పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్.ఐ, విఆర్‌ఓలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై మార్కాపురం ఆర్డీవో పెంచలకిశోర్ గురువారం విచారణ నిర్వహించి రుజువుకావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఆర్‌ఐ, నలుగురు విఆర్‌వోలపై శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు తెలిపారు. గత సెప్టెంబర్ నెల నుంచి విచారణ చేపట్టగా తహశీల్దార్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయన్నారు. 105 ఎకరాల భూమి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తికి ఆన్‌లైన్ చేసినట్టుగుర్తించామని, వెంటనే దాన్ని ఆన్‌లైన్ నుంచి తొలగించామని ఆర్డీఓ చెప్పారు. అంతేకాకుండా విచారణ జరుగుతుండగానే ఆ పొలాలపై ఆ కుటుంబ సభ్యులు వివిధ బ్యాంకుల్లో లక్షల రూపాయలు రుణాలు పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ అక్రమాల్లో ఆర్‌ఐ, విఆర్‌ఓల పాత్రపై విచారణ చేస్తున్నామన్నారు.