ఆంధ్రప్రదేశ్‌

ఉద్దేశపూర్వకంగానే లోక్‌సభ వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదేపదే వాయిదాలు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గురువారం ఉదయం ఆయన ఎంపీలు, మంత్రులు, వ్యూహబృందంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారికి ఏ కోశానాలేదని విమర్శించారు. గతంలో ప్రత్యేక ఆర్థిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం.. ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలన్నారు. ఇకపై ఎవరికీ హోదా ప్రతిపత్తి ఉండదంటేనే అప్పుడు ఆర్థిక సహాయానికి అంగీకరించామని, తరువాత కేంద్రం మాట తప్పిందన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందని, అందుకే టీడీపీకి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అభిప్రాయపడ్డారు. తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని, అందుకే ఇన్నాళ్లూ ఓపికపట్టి చేస్తారని ఎదురుచూసినా ఫలితం లేదన్నారు. రాష్ట్రానికి నిధులివ్వమని కోరితే నాపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని, మూడు పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయన్నారు. అయినా వెనుకంజ వేసేది లేదని, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. హోదా మినహా మిగిలిన 19 అంశాలు, 6 హామీల గురించి వైకాపా నోరు తెరవడం లేదని ఆరోపించారు. జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ఎంపీలంతా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
‘మీపై సీబీఐ దర్యాప్తు ఖాయమని వైసీపీ అంటోంది. నిన్న బీజేపీ అసెంబ్లీలో అదే డిమాండ్ చేసిందని’ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో ప్రస్తావించగా, తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎక్కడా ఏ తప్పు చేయలేదని అన్నారు. యనమల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మురళీమోహన్ మాట్లాడుతూ సినిమా వాళ్లపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తన దృష్టికి రాలేదంటూ, ఎవరూ వ్యక్తిగత అజెండాతో విమర్శలు చేయరాదని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు వైఎస్ చౌదరి, తోట నరసింహం, ఎంపీలు గల్లా జయదేవ్, అవంతి శ్రీనివాసరావు, శాసనసభ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ మాట్లాడారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.