అనంతపురం

పుట్టపర్తి 9వ ప్యాకేజీ హంద్రీనీవా వద్ద ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, మార్చి 23 : పుట్టపర్తి సమీపాన 9వ ప్యాకేజీ హంద్రీనీవా కాలువ వద్ద మరోమారు ఉత్కంఠత నెలకొంది. శుక్రవారం జిల్లా ఎస్ పీ, కలెక్టర్ ఈ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులు పోలీసులకు పనుల గురించి ఆదేశాలు జారీ చేసి వెళ్ళారు. ఆ తరువాత సుమారు 200 మంది పోలీసులు అక్కడ మొహరించడం జరిగింది. గురువారం నాటి నుండి హంద్రీనీవా పనులను అధికార బలంతో ప్రారంభిస్తారని భావించి రైతులు కాలువగట్టున టెంటు వేసుకుని బైఠాయించారు. ఇటీవల సుప్రీంకోర్టులో సైతం సదరు రైతులకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను శిరసావహించి చర్చలు జరిపి న్యాయమైన పరిహారం అందిస్తుందని వారు భావించారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి హంద్రీనీవా కాలువ పుట్టపర్తి సమీపాన ముందుకు సాగకపోవడాన్ని తీవ్రంగా భావించి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులపై పనులు జరిగే విధంగా చూడాలని ఆదేశించి తీవ్ర వొత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ పర్యటన కోసం ప్రత్యేక పోలీసు బలగాలను పుట్టపర్తిలో మొహరించడం అదే బలగాలను గవర్నర్ పర్యటన అనంతరం హంద్రీనీవా కాలవువద్దకు మొహరించడం జరిగింది. బాధిత రైతులకు కమ్మవారిపల్లి గ్రామస్తులు మద్దతుగా 100 మందికి పైగా అక్కడికి చేరుకోవడం, పోలీసులు మొహరించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసినట్లైంది. ప్రభుత్వం యంత్రాంగం సాధారణ రైతులపై దండయాత్ర చేస్తున్నట్లుగా భావించిన యువరైతు ముమ్మనేని కిష్టప్ప గుళికలు మింగి అపస్మారక స్థితిలోకి పోవడం జరిగింది. కమ్మవారిపల్లి గ్రామస్తులు, బాధిత రైతులు వెంటనే గమనించి కిష్టప్పను సత్యసాయి ఆసుపత్రికి తరలించారు. న్యాయమైన పరిహారం కోసం తాము పోరాటం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానం సైతం తమకు జరుగుతున్న అన్యాయం పట్ల తీవ్రంగా పరిగణించి తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇంత దౌర్జన్యానికి వొడిగట్టడమేంటని రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. హంద్రీనీవా అధికారులను నిలువరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవస్థపై వ్యక్తులు, రైతులపై వ్యవస్థ దాష్టీకం అన్న చందంగా వారి మనోవేదనను వ్యక్తం చేశారు. పుట్టపర్తి సమీపాన హంద్రీనీవా సమస్య మరింత జఠిలంగా మారింది.