క్రైమ్/లీగల్

బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట, మార్చి 23: క్షణికావేశం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తనకు బైక్ కొన్విమని మండలంలోని కోనయ్యగారిపల్లెలో బైక్‌కొని ఇవ్వమని పవన్‌చైతన్యకుమార్‌రెడ్డి తల్లి రవికుమారిని కోరగా ఆ తల్లి తనకు అంతస్థోమత లేదని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కొడుకు వెంటనే పురుగుల మందు తాగాడు. అదిచూసి భయపడి తన కొడుకు మరణిస్తాడని అవేదనతో రవికుమార్ ఇంట్లో వాస్‌మాల్ 33 తాగింది. తల్లి అక్కడిక్కడే మృతిచెందగా కొడుకును రాజంపేట ఆస్పత్రికి తరలించగా వైద్యచికిత్స పొంది ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.