తెలంగాణ

14న రాష్ట్ర బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం

నెలాఖరుదాకా అసెంబ్లీ సమావేశాలు భగీరథకు 15 వేల కోట్ల హడ్కో రుణం
మున్సిపల్ ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లు నగరంలో లక్ష సిసి కెమెరాల ఏర్పాటు
జీవిత ఖైదీల విడుదలకు ఆమోదం మంత్రిమండలి కీలక నిర్ణయాలు

హైదరాబాద్: శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదించింది. ఈనెల 14న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టి, నెలాఖరుదాకా కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. సిఎం కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో మంత్రి మండలి నిర్ణయాలను అధికారికంగా మీడియాకు వెల్లడించలేదు. అయితే ప్రధానంగా మంత్రిమండలిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి ముఖ్యమంత్రి బృందం ముంబయి పర్యటన, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, మంచినీటి ఎద్దడి, మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానే సభలో ప్రవేశ పెట్టబోయే బిల్లులకు ఆమోదించడం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. మిషన్ భగీరథకు హడ్కోనుంచి రూ. 15 వేల కోట్లు రుణం తీసుకోవడానికి మంత్రిమండలి అనుమతించింది. అలాగే జల మండలికి రావాల్సిన మొండి బకాయిలను గ్రేటర్ ఎన్నికల ముందు ప్రభుత్వం రద్దు చేయడంతో దానికీ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి మండలి నిర్ణయించింది. సత్‌ప్రవర్తన కలిగిన 252మంది జీవిత ఖైదీల విడుదలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడ శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ నగరంలో నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, నగరంలో లక్ష సిసి కెమెరాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశ పెడుతూ జారీ చేసిన జీవోపట్ల న్యాయస్థానం అభ్యంతరం తెలపడంతో, దానిస్థానంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌స్థానే సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుకూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే ప్రవేశపెట్టబోయే బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మత్స్యశాఖ శిక్షణా కేంద్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి అనుమతించడంతో పాటు సాంస్కృతిక శాఖకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మంత్రి మండలి ఆమోదించింది.