ఖమ్మం

వెంకటేశ్వరునికి చందన అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, మార్చి 24: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి వేకువజామునే పంచామృతాలతో సర్వాంగాభిషేకం అర్చకులు శ్రీనివాసశర్మ, రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా జమలాపురం ఆలయంలో స్వయంభువుకు చందన అలంకారం చేశారు. దాత, పాలకమండలి సభ్యుడు తాతినేని వెంకటేశ్వరరావు వితరణతో చందన అలంకారం నిర్వహించారు. . చందన అలంకారంలో ఉన్న స్వామిని చూసిన భక్తులు తన్మయం చెందారు. ఆదివారం బ్రహ్మోత్సవాలు సందర్భంగా శనివారం మహా పూర్ణాహుతి జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో చైర్మన్ శివరాంప్రసాదు, మాజీ చైర్మన్ కృష్ణమెహన్‌శర్మ, కుటుంబ సభ్యులు, ఇఓ రమణమూర్తి దంపతులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారిని అమ్మవార్లను గరుడ వాహనంపై ఉంచి గిరి ప్రదక్షణ చేయించారు. రాత్రికి స్వామికి పుష్పయాగ శయనోత్సవం పవళింపు సేవ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. వైదికస్మార్త సాంప్రదాయం ప్రకారం ఆదివారం శ్రీ రామ నవమి పర్వదినాన్ని జరిపి సీతారామచంద్రుల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఇఓ తెలిపారు. సాంస్కతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ భారతి రాఘవ నృత్య కేంద్రం విజయవాడ చిన్నారులచే కూచిపూడి నృత్యం, శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి జమలాపురం వారిచే శ్రీనివాస కళ్యాణం నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివరాంప్రసాదు, ఇవో రమణమూర్తి, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, మురళీమెహన్‌శర్మ, విజయదేవశర్మ, రమణబాబు, రఘురామకృష్ణశాస్ర్తీ, సుబ్రహ్మణ్యశాస్ర్తీ, మనోహర్, కెవిఆర్ ఆంజనేయులు, సోమయ్య తదితరులు ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ది అనైతిక విజయం
* ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ఖమ్మం(మామిళ్లగూడెం), మార్చి 24: రాజ్యసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ది అనైతిక విజయమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ స్వార్థ ప్రయోజనాల కోసం టిఆర్‌ఎస్‌లో చేరారన్నారు. ఆయన ఇప్పటికి కూడా అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి పెట్టారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిధులు దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. లకారం ట్యాంక్‌బండ్ నిర్మాణం ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు అద్దం పడుతుందన్నారు. దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ తరలించినా మిగిలిన చెత్తను కాల్చకుండా తరలించే విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కట్ల రంగారావు, మనోహర్‌నాయుడు, శంకర్, గోపి, వంశీ పాల్గొన్నారు.