విశాఖ

‘బాల నేరస్థులను అరికట్టాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, మార్చి 24: సమాజంలో బాలలను సక్రమమైన మార్గంలో నడిపించి, బాలనేరస్తుల పెరగకుండా చూడాల్సిన బాధ్యత జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులపై ఉందని దామోదర సంజీవయ్యనేషనల్ లా-యూనివర్శిటీ పూర్వపు ఉపకులపతి వై. సత్యనారాయణ అన్నారు. స్థానిక డిఎస్‌ఎన్‌ఎల్‌యు మూట్ కోర్టుహాలులో మూడురోజుల పాటు నిర్వహించిన జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుల ముగింపు సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జెజె బోర్డు సభ్యులు బాలనేరస్తులకు వర్తించే చట్టాలను అమలు చేయటంతో చురుకైన పాత్ర వహించాలన్నారు. బాలల రక్షణకు తీసుకోవాల్సిన బాధ్యతలను ఆయన గుర్తుచేశారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగిన శిక్షణా తరగతుల్లో సభ్యులకు ఎన్నోచట్టపరమైన మెళుకువలు, వాటిని ఉపయోగించే పద్ధతుల గురించి నిష్టాతులైన న్యాయ నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. అంతకు ముందు జిల్లా అడిషనల్ జడ్జి వి.సత్యారావు మాట్లాడుతూ జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు తాము శిక్షణాతరగతుల్లో నేర్చుకున్న విషయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలల రక్షణ బాధ్యత మీ అందరి కర్తవ్యమని స్థానిక డిఎస్‌ఎన్‌ఎల్‌యు ఉపకులపతి వి.కేశవరావు అన్నారు. ఈ సమావేశంలో మహిళల రక్షణ -చట్టాలు అనే పుస్తకాలను ఉచితంగా ఇక్కడి వర్శిటీ రచయిత ఒకరు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఇక్కడి వర్శిటీ బాలల రక్షణ కేంద్రం సమన్వయకర్త విజయలక్ష్మీ, రిజిస్ట్రార్ సిపి దయానందమూర్తి, ఫాకల్టీ విశ్వచంద్ర, అసోసియేట్ ఫ్రొఫెసర్లు శ్రీ సుధలు పాల్గొన్నారు.