సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

576. ‘‘దశరధుండును రాజోత్తముం డయోధ్య
యేలికాయన పుత్రులు నట్గురందు
జ్యేష్ఠ తనయుడు రాముడు సత్యమూర్తి
ధర్మవిగ్రహాడతులప పరాక్రముండు

577. తండ్రి మాటను నేరవేర్ప ధర్మపత్ని
తమ్ముడును వెంటరా కాననమున కేగి
వేల సంఖ్యలుగల ఖర దూషణాది
రాక్షసుల హతమార్చె తాపసులు బొగడ

578. అంత రావణుండు మాయలేడిని బంపి
యపహరించె నానరేంద్రు సతిని
పత్ని కొరకు రాము డార్తుడై యడవుల
వెదకె లక్ష్మణుండు తోడుగాక

579. అన్నదమ్ములట్లు జనకజనె్వదకుచు
ఋష్యమూక నగము జేరి వాన
రేశ్వరుండు సుమతి సూర్యజుతో మైత్రి
నెరపి రొకరి కొకరు దోడుపడగ

580. వరబలంబున దర్పించియున్న వాని
భ్రాతృకంటకు డౌవాలిని బరిమార్చి
వానరాధిపు జేసె సుగ్రీవు శుభగు
రామచంద్రుడు స్నేహశౌర్యంబు లలర

581. వానరేశ్వరు నాజ్ఞచే కామరూపు
లధిక బలవంతులౌ కపుల్నాల్గు దిశల
కరిగిరి జనకపుత్రిక నరయనందు
ఒక్కరుండను నేనంచు బల్కి హనుమ

582. పక్షి రాజగు సంపాతి పృధ్వి తనయ
జాడ దెల్పగ నేను రుూ సాగరమ్ము
దాటివచ్చితి రామ వర్ణితములైన
పోలికలుగల రాము నిల్లా గంటి

583. అట్లు గానము జేసూరకుండె హనుమ
కర్ణ పేయము లీమధురోక్తు లెచటి
నుండి వినవచ్చెనని సీత చకితయగుచు
నాల్గు దెసలను బరికించె నంబుజాక్షి

584. తూర్పు కొండ మీద సూర్య బింబమువలె
వృక్షశాఖలందువున్న కపిని
జూచి సీత వానరము నింతకును ముందు
లంకలోన జూడ నేనటంచు

585. తేజవంతుడై వెలుగు వాతూల సుతుని
జూచి సీత యిది రజని చరుల మాయ
యేమొ యని శంకతో నుండ హనుమ సీత
కడకు నేతెంచి శిరసా నమస్కరించి

586. ‘‘తల్లి! నీవు చంద్రుని బాసి యిలకు దిగిన
రోహిణీతారవా? వశిష్ట గురుని వీడి
వచ్చిన యరుంధతీ దేవివా? సముద్ర
తనయ శ్రీ మహా లక్ష్మివా? జనని చెపుము

587. అమ్మ నీవిట్లు కన్నుల నీరు నింప
కారణమ్మేమ్మి రావణు డపహరించి
దెచ్చినట్టి రాముని ధర్మపత్ని వంచు
దలతునమ్మ గుణవతీ లలామ! నిన్ను

588. వినయమున బల్కు కపివరు సౌమ్యరూప
భాషణములకు సీత ప్రసన్న చ
‘‘కపివరా! నీవనిన యట్లు కౌసలేయు
సతిని జనక రాజర్షి పుత్రికను నేను

589. పితృ వచనమును నేరవేర్చ విపినమునకు
తరలుచున్నట్టి భర్తతో మరది లక్ష్మ
ణుండు నేనును చ్చినా మొక్కనాడు
మాయ మృగమును జూచి నేమనసు పడగ
*

టంగుటూరి మహాలక్ష్మి