ఆంధ్రప్రదేశ్‌

పవన్ కుటుంబాన్ని అవమానించడం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీని వెనకేసుకు వస్తూ మోస్తున్న పచ్చ టీవీ ఛానళ్లు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అవమానపర్చడం బాధాకరమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇటువంటి అవమానం ఎవరికి జరిగినా ఖండించాల్సిందేనన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌కు లేఖరాసి, దాని ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విలేఖర్లకు విడుదల చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే దారిలేక పవన్ కళ్యాణ్‌ను, కాపు జాతిని అర్థించి అందలం ఎక్కారన్నారు. చంద్రబాబు అండదండలతోనే ఆయా ఛానల్స్ విచక్షణా రహితంగా ఎదుటి కుటుంబాలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో తాను ఉద్యమం చేశానన్నారు. ఈ క్రమంలో తన కుటుంబాన్నీ, కాపు జాతిని పోలీసు రాజ్యంతో బూటు కాళ్లతో తన్నించిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. టీడీపీని రాబోయే ఎన్నికల్లో సముద్ర గర్భంలో కలిపేందుకు అవసరమైతే ఇతర పార్టీలతో సహకరించి పవన్ కళ్యాణ్ పనిచేయాలని ముద్రగడ సూచించారు. ఛానల్స్‌పై కేసులు పెట్టడం కాదని, ఎన్నికల్లో గట్టిగా పనిచేసి ఆ ఛానల్స్ వెనుక కుట్ర చేస్తున్నవారిని మట్టి కరిపించేలా పవన్ విజృంభించాలన్నారు.