రాష్ట్రీయం

ఆర్నెల్లలో 6.81 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో చెక్కు చెదరని, చెదలు పట్టని షీర్‌వాల్ టెక్నాలజీతో భారతదేశంలోనే ఆదర్శవంతమైన ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టిందని, మరో ఆరు నెలల్లో నిర్ధేశిత లక్ష్యం మేరకు 6.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. రాజమహేంద్రవరం నగరానికి మరో 10వేల ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి డిపిఆర్ సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. మంత్రి నారాయణ సోమవారం నగరంలో రూ.135 కోట్ల విలువైన నిధులతో నిర్మించనున్న డ్రెయిన్లు, ఎస్టీపీ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక బొమ్మూరు వద్ద నిర్మిస్తోన్న గృహ నిర్మాణ సముదాయం వద్ద ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో నగర శివార్లలో విస్తరించిన లేఅవుట్లలో క్రిటికల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ అభివృద్ధి నిమిత్తం రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం రూ.133 కోట్లతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదనలు ఇచ్చారని, ఈ నిధులను మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. తాను అనేక దేశాల్లో ఇళ్ళ నిర్మాణాన్ని చూసి, 30 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు అధ్యయన బృందాలను పంపించి, విశాఖ వర్కుషాపులో అత్యున్నతమైన టెక్నాలజీని ఎంపికచేసి, ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఇళ్లు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. చెక్కు చెదరని, చెదలు పట్టని, భూకంపాలు, తుపాన్లను తట్టుకునే అత్యున్నతమైన టెక్నాలజీతో ఇళ్ళను నిర్మించే యజ్ఞంలో ముఖ్యమంత్రి తనకు అవకాశం కల్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ టెక్నాలజీలో నాలుగు గోడలు ఒకే సారి కాంక్రీటు పోయడం జరుగుతుందని, ఎక్కడా జాయింట్లు ఉండవన్నారు. దాదాపు 50 అంతస్తుల భవనాలు నిర్మించే టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్‌సీసీ, ఎల్ అండ్ టి వంటి సంస్థలకు అప్పగించి కేవలం 17 నెలల్లోనే ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేయాలని టెండర్లు అప్పగించామన్నారు. వెర్టిఫైడ్ ప్లాస్టింగ్, ఏ గ్రేడ్ టైల్స్ వినియోగించి, కిచెన్‌లో కూడా గ్రానైట్ రాళ్ళను వేసి, పౌడర్‌కోటెడ్ ప్రేమ్ కిటికీలను వినియోగించి, ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఆస్పత్రి, షాపింగ్ మాల్స్, కమ్యూనిటీ హాళ్లు, ఆట స్థలం, పార్కు వంటి సదుపాయాలతో, వర్షపు నీరు, బాత్‌రూమ్‌ల నీరు బయటకు కనిపించని విధంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించి సమగ్ర సదుపాయాలతో ఇళ్ళను అప్పగించనున్నామన్నారు. ఒక్కో ప్లాట్‌కు రూ.లక్షన్నర కేంద్రం ఇస్తుంటే, వౌలిక సదుపాయాలతో కలిపి మరో రూ.రెండున్నర లక్షలు రాష్ట్రం సబ్సిడీగా ఇచ్చి, మిగిలింది బ్యాంకు ద్వారా రుణం కల్పించి దీర్ఘకాలంలో స్వల్పవాయిదాల్లో చెల్లించే విధంగా ఏర్పాట్లుచేశామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నామన్నారు.
రాజమహేంద్రవరం నగరానికి ఇప్పటికే 7876 ఇళ్లను రెండు దశల్లో మంజూరు చేశామని, మరో 10వేల ఇళ్లు మంజూరుచేస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఎకరం, రెండెకరాల స్థలాల్లో కూడా గృహ సముదాయాలు నిర్మించేవిధంగా అనుమతిస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఇళ్ళకు సంబంధించి మరో వారంలో ముఖ్యమంత్రి విధి విధానాలను ప్రకటించనున్నారని, అత్యున్నత టెక్నాలజీలో ఇళ్ళను నిర్మించి ఇస్తామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీలు స్వయం సమృద్ధి సాధించడానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు అందించడానికి చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ వివరించారు. ఒక్కో అధారిటీకి కనీసం వందేసి ఎకరాలైనా సమకూరే విధంగా ముందుగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీ శేషసాయి, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ