పశ్చిమగోదావరి

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, ఏప్రిల్ 24: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. మంగళవారం సాయంత్రం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ మండలంలోని భీమోలు గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుండి భూ సమస్య ఉందన్నారు. గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అదే గ్రామంలోని మరో వర్గానికి చెందిన వారు ఆ భూమి తమదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు భూమికి సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు. భీమోలు గ్రామంలోని ఇరువర్గాలకు చెందిన ప్రజలు ఘర్షణలకు దిగుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇరువర్గాల వారు ఘర్షణకు దిగి పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారన్నారు. ఈ గొడవల్లో ఇరువర్గాల వారికి దెబ్బలు తగలడంతోబాటు పోలీసులకు సైతం గాయపడ్డారని, వీరంతా ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారన్నారు. తాను భీమోలు గ్రామం వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 62 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం భీమోలు గ్రామంలో భూ సమస్య అధికారుల పరిధిలో ఉందని, అయితే గ్రామస్థులు మద్యం సేవించి ఘర్షణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఎన్ మురళీకృష్ణ, సిఐ కె బాలరాజు, ఎస్‌ఐ ఎం జయబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా కుళాయి కనెక్షన్
ఏలూరు, ఏప్రిల్ 24: జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 3.50 లక్షల ఇళ్లకు మంచినీటి పైపులైన్ సౌకర్యాన్ని కల్పించి ఇంటింటా కుళాయికనెక్షన్ అందిస్తామని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణప్రాంతాలలో ఏ మహిళా కూడా మంచినీటి కోసం వీధికుళాయిలను ఆశ్రయించాల్సిన పని లేదని, ప్రతి పేదకుటుంబానికి ప్రభుత్వమే కుళాయికనెక్షన్ అందించే బృహత్తర కార్యక్రమాన్ని అమలుచేయనుందని, ఈమేరకు త్వరలోనే కాంట్రాక్టు పనులు ఖరారు చేస్తామన్నారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లలో చిత్తశుద్ధిగా వ్యవహరించి నూరుశాతం పన్నులు వసూలు చేయాలని, అప్పుడే ఆ నిధులతో పంచాయితీ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్తసేకరణపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ బడి, గుడి ఎంత అవసరమో డంపింగ్‌యార్డు కూడా అంతే అవసరమన్నారు. గ్రామాలలో అన్ని సౌకర్యాలు కల్పించటం వల్ల గతంలో కంటే గ్రామాల నుండి వలసల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల్లో ఎన్నో పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరు డాక్టరు భాస్కర్ చొరవ తీసుకుని ప్రతి మండలానికి కోటి రూపాయల నిధులు తెచ్చారని, ఈ నిధులను ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి తీసుకురావటంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. మురుగునీరు బయట ప్రవహించకుండా దెందులూరు నియోజకవర్గానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను మంజూరు చేసినందుకు కలెక్టరు భాస్కర్‌కు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరూ బడిమానకుండా బడికి వెళ్లేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ పంచాయితీలుగా ఎన్నికైన గ్రామసర్పంచులు, కార్యదర్శులు, జడ్పీటీసీలకు కలెక్టరు డాక్టరు భాస్కర్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఛాంబర్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి సత్తిరాజు, జిల్లా అధ్యక్షులు కె గోపాలరావు, డిపిఓ ఎం వెంకటరమణ, జడ్పీ సిఇఓ డి సత్యనారాయణ, డిఎల్‌పిఓలు చిన్నారావు, అమ్మాజీ, అర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నాలుగు గంటలు ఆలస్యం
వీరవాసరం, ఏప్రిల్ 24: తిరుపతి నుంచి నరసాపురం వెళ్లే ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం నాలుగు గంటలు ఆలస్యంగా వీరవాసరం చేరుకుంది. ఉదయం 5.30 గంటలకు రావాల్సిన ఈ రైలు 9.30 గంటలకు చేరుకుంది. రైలు ఆలస్యంగా రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ తిరుపతిలో రైలు నిర్ణీత సమయానికే బయల్దేరిందని, అయితే అర్థరాత్రి సమయంలో సుమారు 3గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ఈ జాప్యం ఏర్పడినట్టు చెబుతున్నారు.