తెలంగాణ

ఆర్టీసీ నష్టాలకు ఉద్యోగులు బాధ్యులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ఆర్టీసీ కార్మిక నాయకులను ఉద్ధేశించి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా అంటూ ముఖ్యమంత్రి బెదిరింపుగా మాట్లాడటం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలా విస్మరించారని ఆయన ప్రశ్నించారు. సంస్థ నష్టాలకు ఉద్యోగులు ఏ విధంగా బాధ్యులో ముఖ్యమంత్రి తెలపాలని , కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాల్లో సుమారు ఐదు వేల మంది పదవీ విరమణ పొందినా వారి స్థానాలను భర్తీ చేయలేదని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంస్థకు 2800 కోట్ల అప్పు ఉందని బెదిరిస్తే ఎలా అని అన్నారు. ప్రతి సంవత్సరం 1100 బస్సులను తుక్కు కింద తీసేయాల్సి ఉండగా, వాటిని అలాగే నడిపిస్తున్నందు వల్ల కొంత నష్టం వస్తుందని, వాటిని ఎందుకు ఉపసంహరించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఫిట్‌మెంట్ ప్రకటించిన సందర్భంగా సిఎం ఇకపై నెల రోజులు ముందుగానే ఫిట్‌మెంట్ ప్రకటిస్తామని చెప్పి ఇపుడు మాట మార్చారని అన్నారు.