తెలంగాణ

ప్రొటెం స్పీకర్‌గా ఎవరు ఉండాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకీ మెజారిటీ సంపూర్ణమైన రాకపోవడంతో గంట, గంటకూ మారుతున్న రాజకీయాలతో ఉత్కంఠ నెలకొంటున్నది. అయితే శనివారం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమించారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని జెడిఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా, లోక్‌సభకైనా ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. దానికి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యున్ని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఆ సీనియారిటీలోనూ ఎవరు ఎక్కువ సార్లు ఎన్నికైంది చూసి సంబంధిత చట్ట సభల కార్యదర్శులు గవర్నర్‌కు సమాచారం ఇస్తే ఆ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇది ఒక సంప్రదాయం మాత్రమే. ఇక్కడ ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎన్నికైన వారిలో లోగడ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన వారు ఉండి ఉంటే ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఇప్పుడు కర్నాటకలోనూ అదే జరిగింది. సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా మాజీ స్పీకర్ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమించారు. ఎవరు సీనియర్ అనేది కాకుండా సభను ఎవరు సక్రమంగా నిర్వహించగలరన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎన్నికైన వారిలో ఒక్కరూ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు లేకపోతే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైతే అప్పుడు గవర్నర్ తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటారు.