జాతీయ వార్తలు

ప్రాంతీయ పార్టీల్లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: కర్నాటకలో అధికార పగ్గాలు బీజేపీకి దక్కకుండా చేయడంలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ వల్ల తమకు ముప్పు ఉందని భావించే ప్రాంతీయ పార్టీలు, ఇది అంతం కాదు, ఆరంభం అనే రీతిలో బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి. జేడీఏస్-కాంగ్రెస్ కూటమి కర్నాటకలో ఈ నెల 23న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 38 సీట్లు వచ్చిన జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి వదులుకుని, ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామిగా ఉండేందుకు కాంగ్రెస్‌కు సిద్ధపడడంపై బీజేపీయేతర పక్షాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారాన్ని కైవశం చేసేందుకు వేసిన ఎత్తుగడలను ఆహ్వానించారు. కాగా మమత బెనర్జీ కర్నాటక ప్రయోగాన్ని ఆహ్వానిస్తూనే, యువనేత, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పేరును ఎక్కడ ప్రకటనలో ప్రస్తావించలేదు. కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని, ఈ విజయానికి దేవేగౌడ, కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ, ఇతరులు కారణమని మమత పేర్కొన్నారు. కాగా కర్నాటక స్ఫూర్తితో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. కాని ఈ ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాలన్న డిమాండ్‌కు కొన్ని పార్టీలు వ్యతిరేకం. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా, ఆ పార్టీలకు ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ ఉంది. ఈ విషయంలో కొన్ని పార్టీలు ఆచితూచి అడుగువేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ప్రధాన శత్రువు కాంగ్రెస్. కర్నాటకలో జేడీఎస్‌కు తొలి నుంచి మద్దతు ఇస్తున్న టిఆర్‌ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపడేందుకు సాహసం చేయదు. సీపీఐ జాతీయ నేత డి రాజా మాట్లాడుతూ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే నేతను బహిరంగంగా ప్రకటించాలన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే మహాకూటమిని కాంగ్రెస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై తర్వాత ఆలోచించవచ్చన్నారు. బీజేపీని తుక్కుగా ఓడించడమే అన్ని పార్టీల ముందున్న లక్ష్యంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల పట్ల పదవుల పంపకంలో ఉదార వైఖరిని అవలంభించడం మంచి పరిణామమని రాజకీయ విశే్లషకులంటున్నారు. బీజేపీని ఏ విధంగానైనా మట్టికరిపించాలన్న పట్టుదలతో డిఎంకె స్టాలిన్, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు ఉన్నారు. కర్నాటకలో బీజేపీకి ఓటమికి చంద్రబాబు బాగా కృషి చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమైన బీజేపికి గుణపాఠం చేప్పేందుకు కర్నాటక ఎన్నికలను చంద్రబాబు ఆయుధంగా మలుచుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతోందని, కర్నాటకలో 122 సీట్ల నుంచి 78 సీట్లకు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనే నేతలకు కరవులేదు. బొటాబొటిగా 37 సీట్లు తెచ్చుకున్న జేడీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఔదార్యంతో సిఎం పదవిని ఆఫర్ చేయడంపై ప్రాంతీయ పార్టీల నేతలు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ చర్యను ఆహ్వానిస్తూనే, మిత్రపక్ష కూటమిలో ఎక్కువ సీట్లున్న పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి తారిక్ అన్వర్ అన్నారు.