తెలంగాణ

పంచాయతీ పోరుకు ‘సై’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆదివా రం కూకట్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో బిజెపి రా ష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ సమావేశాలు ముగుస్తాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన ఆరంభమైన కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ ప్రధా న కార్యదర్శి మురళీధర్ రావు, జాతీయ నాయకుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ బ లోపేతం, రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలను ఎ దుర్కొవడం, వచ్చే నెలలో పార్టీ జాతీయ అధ్యక్షు డు అమిత్ షా పర్యటన ఏర్పాట్లు, రోడ్-షోలు, బ హిరంగ సభలు నిర్వహించడం వంటి అనేకానేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు దేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి ఒంటరిగా పంచాయతీరాజ్ ఎన్నికలను ఎదుర్కొబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వా రు భావించారు. ఏమాత్రం తేడా వచ్చినా, దీని ప్ర భావం వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటింటికీ బిజెపి పేరిట ప్రజల్లోకి వెళ్లాలని వారు నిర్ణయించారు.
సంక్షేమ పథకాలతో పాగా: మురళీధర్ రావు
సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ వారి ఆదరాభిమానాలను చూరగొనాలని అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌ను రూపొందించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. అవినీతిరహిత, సుస్థిర పాలన అందిస్తున్న ప్రధాని మోదీ దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వ్‌డ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు.

చిత్రం..బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు