తెలంగాణ

కేసీఆర్.. రైతు ‘రాబందు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుభాంధవుడు కాదని రైతు రాబందువని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు వ్యవసాయాన్ని, రైతాంగ సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి రైతుబంధు పేరుతో భారీ మోసానికి తెరలేరపారని దుయ్యబట్టారు. ఆదివారం గాంధీభవన్‌లో కిసాన్‌సెల్ చైర్మన్ కొందడరెడ్డి అధ్యక్షతన రైతు ప్రగతి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీ్ధర్ బాబు హాజరై కేసీఆర్ వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎన్నికల కోసమే వ్యవసాయ తాయిలాలు ప్రకటించారని, గతంలో వ్యవసాయం దండగా అన్న వారు వ్యవసాయాన్ని లాభసాటి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వ్యవసాయం పండుగ అని చెప్పి విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని అమలు చేసి చూపిందన్నారు. దేశానికి మొదటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ దేశంలో వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను చందాలు తీసుకునే వారిగా చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయని కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయాన్ని ఉద్దరిస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుబంధు పథకం కొంతమందికే లబ్ధి చేకూరుతోందని అన్నారు. పథకానికి సీలింగ్ విధించకుండా వందలాది కోట్లను బడా భూస్వాములకు అప్పగిస్తున్నారని అన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న వారికి రైతుబంధు ప్రయోజనం చూకూర్చడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కౌలుదారులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాలని, పండిన పంటను భద్రపరుచుకునేందుకు మార్కెట్లలో వసతులు కల్పించాలని, రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, మృతి చెందిన రైతు కుటుంబాలన్నింటికీ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ చెప్పి నా కుంభకర్ణుడిలా నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు నిద్రలేచి రైతులు, రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఆలోచన చేశాడని జైపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కూడా అబద్దాలు చెప్పిన వ్యక్తి రైతులకు ఎలా లాభం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ సీఎం కేసీఆర్ రైతాంగానికి చేస్తున్న మోసాలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక వ్యవసాయ విధానాన్ని ప్రకటించి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 20 పంటలకు కచ్చితంగా మద్దతు ధర ఇవ్వడంతో పాటు రైతులకు పూర్తిస్థాయి పెట్టుబడి సాయాన్ని అందించి అన్ని రకాలుగా అందుకుటుంటామని పేర్కొన్నారు.

చిత్రం..గాంధీ భవన్‌లో రైతు ప్రగతి సదస్సులో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి