తెలంగాణ

అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐసీడీఎస్‌లో సూపర్ వైజర్ -గ్రేడ్ 2 పోస్టులను వందకు వందశాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆదివారం సూపర్ వైజర్ల నియామానికి సంబంధించిన విషయాలపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీల నిర్వహన, నియామక ప్రక్రియ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అనుభవజ్ఞులు, అర్హుత కలిగిన వారినే సూపర్ వైజర్లుగా నియమించాలని ఆదేశించారు. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వారి అనుభవాలను సద్వినియోగం చేసుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు.