ఆంధ్రప్రదేశ్‌

పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్‌తో మేనిఫెస్టో కాపీ జత చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 27: ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో చేర్చి కొన్ని పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించింది. పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు తమ అఫిడవిట్‌తో పాటు మేనిఫెస్టో కాపీని తప్పనిసరిగా జత చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఫ్యాక్స్ ద్వారా ఆయన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అఫిడవిట్‌ను ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. మేనిఫెస్టో కాపీని అఫిడవిట్‌తో పాటు జతపరిస్తే ఇక ఏ రాజకీయ పార్టీ అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి అవకాశం ఉండదన్నారు. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే జూలై మొదటి వారంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు డాక్టర్ డీవీ రావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.