విజయనగరం

గుర్తింపు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 18: ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయం చేసిన ఎంప్లారుూస్ యూనియన్(ఇయు)కు గుర్తింపుకార్మిక సంఘం ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రమణరాజు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల (ఎన్‌ఇసి) విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపుసమయంలో ఎంప్లారుూస్ యూనియన్ వ్యవహరించిన అస్తవ్యస్త విధానాల వల్ల కార్మికుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రానున్న గుర్తింపుసంఘం ఎన్నికల్లో మళ్ల్లీ గుర్తింపులోకి వచ్చేందుకు కల్లబొల్లి కబుర్లు చెప్పి కార్మికులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందువల్ల ఎంప్లారుూస్ యూనియన్ నాయకుల మాటలు నమ్మవద్దని ఆయన కోరారు. ఎంప్లారుూస్ యూనియన్ గుర్తింపుసమయంలో యాజమాన్యంతో కుదిరిన బాండు ఒప్పందాన్ని రద్దు చేసి కార్మికులకు డబ్బులు ఇప్పించామని, ఇది ఎన్‌ఎంయు సాధించిన ఘన విజయమన్నారు. గుర్తింపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను కూడా ఇప్పించామని తెలిపారు. వీటన్నింటినీ చూసి ఓర్వలేక యాజమాన్యంతో ఎంప్లాయిస్‌యూనియన్ కుమ్మక్కై మెయింటెనెన్స్ విధానం మారుస్తూ కొత్త సర్క్యులర్ ఇచ్చారని, దీనివల్ల బస్సుల కండిషన్ పూర్తిగా దెబ్బతినడమేకాకుండా గ్యారేజి కార్మికులపై పనిభారం పెరుగుతుందని చెప్పారు. దీనిని వెంటనే రద్దు చేయాలని రమణరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంయుక్తకార్యదర్శి పివివి మోహన్ మాట్లాడుతూ పేస్కేలు గడువుముగిసి 15 నెలల పూర్తయిందున వెంటనే పే స్కేలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌కార్యదర్శి శ్రీనివాసరాజు, జోనల్ అధ్యక్షుడు వి.ప్రదీప్‌కుమార్, రీజనల్ కార్యదర్శి బిఎస్ రాములు, డివిజనల్ కార్యదర్శి డిఎస్‌రావు,డిపోకార్యదర్శి పిజి రాఫిల్, డిపోఅధ్యక్షుడు డిఎన్ రాజు పాల్గొన్నారు.