వరంగల్

పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 18: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం దూకుడు పెంచింది. పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ఈనెల ఆఖరుతో ముగియనుంది. ఎట్టి పరిస్ధితిలోనైనా గడువులోగే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. పంచాయతీ అధికారులకు ఎన్నికల సంబంధించిన సామాగ్రి కూడా పంపిణీ చేశారు. ఒకవైపు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కు శిక్షణా కార్యక్రమాలు, బూత్ స్థాయి సమావేశాలు కూ డా జరిగిపోయాయి. దీంతో ఎన్నికల ప్రక్రియలో ప్రధాన అంకం పూర్తికావచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో పంచాయతీ ఓటర్ల లెక్క తేల్చేశారు. ఇక ఒక్క బీసీ రిజర్వేషన్ల లెక్క మాత్రమే తేలాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఐనవోలు, వేలేరు, ఎలుకతుర్తి మొత్తం ఏడు మండలాల్లో 1,95,393 ఓటర్లు ఉన్నారు. 130 గ్రామ పంచాయతీ వారిగా జాబితాను సిద్ధం చేశారు. అందులో పాత పంచాయతీలు 104కాగా, 26కొత్తగ్రామపంచాయతీ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కమాలాపూర్ మండంలో అత్యధికంగా 41,675 ఓటర్లు ఉండగా వేలేరు మండలంలో అతి తక్కువగా 16,857 ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీలు 26 కొత్తవి పెరగడంతో అందుకు అనుగుణంగా వార్డుల సంఖ్యకూడా పెరుగనుంది. గతంలో 1058వార్డుల ఉండగా పెరిగిన సంఖ్యతో కలిపి 1248కి చేరింది.
వాయిదా పడితే బాగుండు: ఎమ్మెల్యేలు
గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. సర్పం చ్ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారనుంది. వచ్చేది సాధారణ ఎన్నికల సీజన్ కావడంతో గ్రామాలల్లో సర్పంచ్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో టికెట్లు ఎంత మందికి వస్తాయి, రాని వారి పరిస్ధితి ఎంటనే ప్రశ్న తలెత్తు తుంది. సర్పంచ్ టికెట్ ఆశించి భంగపడిన వారు ఇతర పార్టీలకు జంప్ అవుతారనే ఆందోళన ఎమ్మెల్యేలకు పట్టుకుంది. మరో ఆరు, ఏడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నిక లు రానున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక, ఎన్నికల ఖర్చుపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.