నిజామాబాద్

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 18: పోలీసుశాఖల నేరాల పరిశోధనలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని ఎస్పీ శే్వతారెడ్డి అన్నారు. సోమవారం పోలీసు శిక్షణ కేంద్రంలో నూతన కానిస్టేబుల్స్, ఆఫీసర్ల శిక్షణను ఎస్పీ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞాన అవశ్యకతను, పనితీరును వివరించారు. కానిస్టేబుల్స్ కోర్టు విధుల నిర్వహణ తీరు ఏలా ఉండాలన్నది వివరించారు. ఆందోళనల సమయంలో ఏలాంటి చర్యలు చేపట్టాలని, పోలీసుశాఖ పనితీరుపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం కల్గేలా ఏలాపనిచేయాలన్న ఆంశాలపై ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణితోపాటు శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్

కామారెడ్డి, జూన్ 18: కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన రాంకుమార్‌గౌడ్, తన సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ పద్మా రాంకుమార్‌గౌడ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీనివీడి కారు ఎక్కారు. విప్ గంప గోవర్ధన్ సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. భార్యభర్త లు కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేరడం చర్చంశనీయంగా మారింది. ఇప్పటికే చైర్‌పర్సన్ సుష్మ టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెల్సిందే. కార్యక్రమంలో చైర్‌పర్సన్ సుష్మా, వైస్ చైర్మన్ మసూద్, పాల్గొన్నారు.