నిజామాబాద్

ప్రొ.జయశంకర్‌కు ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని గురువారం ఆయా పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి ఘన నివాళులర్పించారు. కంఠేశ్వర్‌లో గల జయశంకర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, ఆయా డివిజన్‌ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ కమిషనర్ జాన్‌శాంసన్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, 1969లో మొదటిసారిగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం పోరాడడం జరిగిందని, కొన్ని శక్తుల వల్ల అప్పట్లో ఆ ఉద్యమం ఆగిపోయిందన్నారు. 2001లో తెలంగాణ కోసం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించడంతో జయశంకర్ మళ్లీ ఉద్యమంలోకి అడుగు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ సాధన విషయంలో తెరాస అధినేత కేసీఆర్‌కు సూచనలు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు అనేకసార్లు జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ముందు జయశంకర్ మన మధ్యన లేకుండాపోయారని, ఇది ఎంతో ఆవేదనను మిగిల్చిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జయశంకర్ కలలు గన్న బంగారు తెలంగాణలో సాకా రం అవుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శులు నవీనాచారి, నరాల సుధాకర్, అవంతికుమార్, లక్ష్మినారాయణ భరద్వాజ్, అపర్ణలు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్ తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్‌కుమార్, తెలంగాణ బీసీ సంఘం ఆధ్వర్యంలో వెంకులు తదితరులు జయశంకర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.