క్రీడాభూమి

గట్టెక్కిన బ్రెజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బ్రెజిల్ అత్యంత కష్టం మీద విజయం సాధించి, ముందంజ వేసింది. ఐదుసార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని ఫిలిపె కౌటిన్హో, నేమార్ కల్పించారు. ఇంజురీ టైమ్‌లో వీరు చేసిన గోల్స్ బ్రెజిల్‌ను గట్టెక్కించాయి. మ్యాచ్ ఆరంభం నుంచి కోస్టారికా దాడులకు ఉపక్రమించడంతో కంగుతిన్న బ్రెజిల్ ఆత్మరక్షణ విధానాన్ని అనుసరించింది. డిఫెన్స్ తప్ప అఫెన్స్ అనే మాటే లేకుండా ఆటను కొనసాగించింది. స్టార్ ఆటగాడు నేమార్ మళ్లీ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నట్టు కనిపించినప్పటికీ, గోల్స్ కోసం అతను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోస్టారికాను అడ్డుకోవడంపైనే బ్రెజిల్ దృష్టి సారించడంతో, ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఒకటిరెండుసార్లు మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పటికీ, మొత్తం మీద రక్షణాత్మక విధానమే కొనసాగింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే, నాకౌట్ దశకు చేరుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయం అత్యవసరం కావడంతో, ఇంజురీ టైమ్‌లో బ్రెజిల్ సర్వశక్తులు ఒడ్డి దాడులు చేసింది. ఆరంభంలోనే కౌటిన్హో గోల్ చేయడంతో ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఆరు నిమిషాల తర్వాత నేమార్ గోల్ చేశాడు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న నేమార్ నిజానికి ఈ వరల్డ్ కప్‌లో ఆడడం అనుమానంగానే కనిపించింది. కానీ, అతను ఫిట్నెస్ సమస్య వేధించడం లేదన్న రీతిలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్ చేసి అభిమానులను అలరించాడు.