‘ఇదం జగత్’ ఫస్ట్‌లుక్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘సుమంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ‘ఇదం జగత్’ టైటిల్‌కు చక్కని స్పందన వచ్చింది. హీరో పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’అన్నారు. శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీకంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్.