చిత్ర పరిశ్రమ సంక్షేమమే మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ బాగుండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. ఇక్కడ పెద్దా చిన్నా బేధం లేదని.. అందరూ ఎవరి స్థాయిలోవారు గౌరవంగా బతికేలా చూస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన భవన భూమిపూజా కార్యక్రమంలో తలసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ్ధర్‌రెడ్డి, ఎంఐఎం సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలంయాదవ్, చిత్రపురి హిల్స్ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కొమర వెంకటేష్, ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ బందరుబాబీ, ఎంఐఎం నాయకులు నవీన్‌యాదవ్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజా కార్యక్రమం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో కొందరు స్వార్థంకోసం రకరకాల యూనియన్‌లు పెట్టుకుంటున్నారు. ఇలా ఎవరికివారు విడిపోతే ఐఖ్యత ఉండదు. ఒకే యూనియన్ ఉండాలి. తెలుగుఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ను ప్రభుత్వం గుర్తిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్లకు లేని వాళ్లకుమధ్య అంతరం అలాగే ఉండిపోతోంది. స్థాయిలు మరచి ప్రతి ఒక్కరు గౌరవంగా బతకాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. మా దృష్టిలో అందరూ సమానమే. చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమంగా ఉండి స్థిరపడేందుకు సహకారం అందిస్తాం. డాన్సర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి నావంతు ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటిస్తున్నాను. కాదంబరి కిరణ్ ‘మనం సైతం’అంటూ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సంస్థకు కూడా ఐదు లక్షల రూపాయలు సహాయం అందించాము అన్నారు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ.. 25 ఏళ్ల మా కల ఇవాళ నెరవేరుతోంది. మా సంఘానికి సొంత భవనం ఉండాలన్నది ముక్కురాజుగారి కోరిక. ఆయన లక్ష్యం ఇవాళ నిజమయింది. మా జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం ఎక్కడైనా మాకు ఇంటి స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాం. పరిశ్రమకు వచ్చి ఇనే్నళ్లుగా బతుకుతున్నందుకు మా కుటుంబం ఉండేందుకు నీడ కల్పించిన వారవుతాం. ప్రభుత్వం ఈ విషయంలో సహాయంచేయాలని కోరుతున్నాం అన్నారు. మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. మన డాన్సర్లకు ఇవాళ గొప్ప పండగరోజు. అలనాటి నాయకులు ముక్కురాజునుంచి ఇప్పటి సంఘ నాయకుల కృషితో సొంత భవన నిర్మాణం జరుపుకుంటున్నాం. తలసాని శ్రీనివాస యాదవ్‌గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక డాన్సర్స్ యూనియన్ సమస్యలు తీర్చారు. సంఘంలోని అందరినీ ఒక్క తాటిమీదకు తీసుకొచ్చారు. డాన్సర్లకు ఇదొక్క యూనియన్ మాత్రమే ఉంటుంది అనే చెప్పేంత గుర్తింపు తీసుకొచ్చారు అన్నారు.