Others

నీ మోము చంద్రబింబమే--1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గాథాసప్తశతి’ క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన సంకలన గ్రంథం. సంకలకర్త హాలుడు. హాలుడు కూడా కొన్ని గాథలను స్వయంగా వ్రాశాడు. ఇతడు శాతవాహన చక్రవర్తి. శాతవాహనులు తెలుగు రాజులు. హాలుడినే శాతవాహనుడు లేదా శాలివాహనుడు అని కూడా అంటారు. శాలివాహనశకం ఈతని పేరుమీదనే ప్రారంభమైంది. ఈతని ఆస్థానంలో అనేకమంది కవులుండేవారని ప్రతీతి.
‘గాథాసప్తశతి’ మహారాష్ట్రీ ప్రాకృత భాషలో రచింపబడిన గ్రంథం.
‘వెబర్’ వంటి పాశ్చాత్య పండితులను సైతం ఈ గ్రంథం ఎంతగానో ఆకర్షించింది. దీనికి కారణం- రెండువేల ఏళ్ళనాటి జన జీవనం ఈ గాథలలో ప్రతిఫలిస్తూండడమే. క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికి లోకంలో ప్రాచుర్యంలో వున్న కోటి గాథలనుంచి ఏడు వందల గాథలను ఎన్నుకున్నానని హాలుడు స్వయంగా చెప్పాడు.
అమాయకులైన పల్లె జనుల మనోహర వ్యవహారములు, మనోవ్యాపారములూ ఎలాంటి అరమరికలు లేకుండా ఇందులో వర్ణించబడ్డాయి.
మనకు తెలిసినంతవరకు తొలిసారిగా శ్రీనాథుడు ‘శాలివాహన సప్తశతి’ పేర్లతో ఈ గాథలను తెలుగులోకి అనువదించాడట. అయితే రెండు మూడు పద్యాలు తప్ప పూర్తి గ్రంథం అలభ్యం. ఆధునికులలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారూ, వాసిరెడ్డి వెంకట సుబ్బారావుగారు మొదలైనవారెందరో తెలుగులో అనువదించే ప్రయత్నం చేశారు. గాథాసప్తశతిలోని శ్లోకాలు, వాటిలోని చమత్కారాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామనే తలంపుతో ఇప్పటి సమాజానికి నప్పని, ఒప్పుకోలుగాని గాథలను మినహాయించి కొన్ని గాథలను సరళమైన పద్యాల రూపంలో అనువదించే ప్రయత్నం చేశాను. ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే. ఇందుకు నాకు అనేకమైన గాథాసప్తశతి అనువాదాలు ఉపయోగపడ్డాయి. వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ పద్యాలకు పూర్వాపరాల వివరణతో ‘ఆంధ్ర గాథాలహరి’గా మీ ముందుంచుతున్నాను.
శ్రీ ఉమాధవుండు చిత్తజుదమనుండు
నంది వాహనుండు నందకరుడు
విఘ్నపతిని గుహుని ప్రేమతో ముద్దాడు
శంకరుండు మనకు శర్మమొసగు!
-గణపతిని, కుమారస్వామినీ ముద్దాడుతూ సపరివారంగా పరివేష్ఠించి ఉన్న ఉమాపతియైన పరమశివుడు మనకందరకూ సుఖసౌఖ్యములను కలిగించుగాక!
1
ప్రాకృతం
ధరణీ ఏం మహాణస కమ్మలగ్గ మసిమలి ఇఏణ హత్థేణ
ఛిత్తం ముహం హసిజ్జఇ చందావత్థం గఅంపఇణా! (హాలుడు)
సంస్కృత ఛాయ
గృహాణ్యా మహానస కర్మలగ్న మషీమలినితేన హస్తేన!
స్పృష్టం ముఖం హాస్యతే చంద్రావస్థాం గతం పత్యా!!
తెలుగు
ఆ.వె చేతికంటిన మసి చెక్కిలిపై చేర
వంటసేయుచున్న ఇంటిదాని
వదన గరిమగాంచి పతినవ్వుచు పలికె
‘చంద్రబింబమిపుడు సాటి నీకు’
-ఇల్లాలు వంట ఇంట్లో వంట చేసుకుంటోంది. అప్పుడే వచ్చిన పతి ఆమెను చూచి ‘నీ ముఖం ఇప్పుడు కదా! చంద్రబింబంతో సాటి’ అన్నాడు. ‘ఎందుకు?’ అందామె. ‘మసి చుక్క నీ బుగ్గకు అంటుకోవడంవల్ల చంద్రబింబంలో ఉన్న మచ్చ కూడా నీ ముఖానికిప్పుడు సమకూరింది. అందువల్ల ఇపుడు నీ ముఖం నిజంగా చంద్రబింబమే!’ అన్నాడు పతిదేవుడు. ఆమె కిలకిలా నవ్వింది.

--డి.వి.ఎం.సత్యనారాయణ narayana d7@gmail.com