జాతీయ వార్తలు

మాది త్యాగధనుల పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శలు గుప్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆ పార్టీ దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ- నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతున్నారని, దేశంలోని అన్ని మతాలు, భాషలవారి పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కల్పనల సృష్టించడం ద్వారా ప్రధాన మంత్రి పదవి ప్రతిష్టను దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోదీ ఏం సాధించారనేది ప్రజల ముందు పెట్టాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌కు 133 సంవత్సరాల చరిత్ర ఉన్నదని, జవాబుదారీతనం నుండి పారిపోతున్న నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకికు సర్ట్ఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీతోపాటు ఎంతోమంది మహానాయకులు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారనే విషయం మోదీకి తెలియదా అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు.
మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశంకోసం తమ ప్రాణాలు అర్పించారని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం అంటే ఏమిటో తెలియని నరేంద్ర మోదీది సంకుచిత ఆలోచనా విధానమని అన్నారు. బ్రిటిష్ పాలకులతో చేతులు కలిపినవారు దేశభక్తి, ప్రజాసేవ గురించి పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించరాదని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగేళ్ల పాలన గురించి పార్లమెంటులో చర్చించే ధైర్యం నరేంద్ర మోదీకి ఉన్నదా అని ఆనంద్ శర్మ నిలదీశారు. ఏమీ సాధించలేని మోదీ దేశమంతా తిరుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. నరేంద్ర మోదీ అభివృద్ధి గురించి ప్రచారం చేయటం లేదు.. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దు, తప్పుడు జీఎస్‌టీ విధానం మూలంగా కోట్లాది మంది పేదరికం స్థాయికి దిగువకు వెళ్లారని ఆనంద్ శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశాభివృద్ధి జరగలేదంటూ నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.