జాతీయ వార్తలు

చట్టసభల్లో చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేహబాద్ (హర్యానా), జూలై 15: ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యున్నత వేదికలని, ఈ సభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అర్థవంతమైన చర్చలు జరిపి ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొనాలని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. చట్టసభల గౌరవాన్ని, హుందా తనాన్ని పరిరక్షించేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయన్నారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు సమయాన్ని వృథా చేయకుండా అంకితభావంతో నడుచుకోవాలని కోరారు. చర్చ అనేది ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రక్రియని, ఈ మార్గం నుంచి దారి తప్పరాదని ఆయన కోరారు. ఫడేహబాద్‌లో శిరోమణి కబీర్ ప్రకాశ్ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చండీగర్‌కు రెండు వందల కి.మీ దూరంలో ఈ పట్టణం ఉంది. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రసీ ఉమ్మడి కృషి చేయాలన్నారు. అప్పుడే సమాజంలో అసమానతలను పారదోలగలమన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ఇరువురు పనిచేయాలన్నారు. సంత్ కబీర్ దాస్ గొప్ప సంస్కర్త అని సామాజిక దురాచారాలపై రాజీలేకుండా పోరాడిన మహనీయుడని ఆయన నివాళులు అర్పించారు. కులం,మతం, రంగు, ప్రాంతం, భాష, వర్గాలకు అతీతంగా మానవాళి మహోన్నతమైన శాంతి మార్గం చూపించిన గొప్ప రుషి అని ఆయన కొనియాడారు. ఈ రోజుకు కూడా సంత్ కబీర్ దాస్ బోధనలు వెలుగును విరజిమ్ముతున్నాయన్నారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, రామమనోహర్ లోహియా సిద్ధాంతాలు ఆచరణనీయమన్నారు. వారు ప్రజల జీవితాల అభ్యున్నతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడారని, వారి త్యాగాలు నిరుపమానమన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత జీవితం యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. సంత్ కబీర్ జీవితం అంబేద్కర్‌కు గొప్ప స్ఫూర్తి, ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే సిద్ధాంతాల ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామన్నారు. హర్యానా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. సంత్ కబీర్ వార్షికోత్సవాలను నిర్వహించడాన్ని అభినందించారు. హర్యానా గవర్నర్ కె సింగ్ సోలంకీ తదితరులు పాల్గొన్నారు.