రాష్ట్రీయం

ఆణివార ఆస్థానానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి సర్వం సిద్ధమైంది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకి ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఆదివారం పల్లకీని సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రానికి వాహన మండపం వద్ద వివిధ దేవతామూర్తుల సెట్టింగులను సిద్ధం చేయనున్నారు. మంగళవారం ఉదయానికి పుష్పాలంకరణలు పూర్తిచేస్తారు. ఈసారి పండరీపురం పాండురంగ విఠలుని రూపంలో పుష్పపల్లకిని అలంకరించేందుకు టీటీడీ ఉద్యానవన విభాగం సమాయత్తమైంది.