నల్గొండ

అప్‌కమింగ్ ఎమ్మెల్యే కూడా ఉంటారా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 16: ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారే ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతారని.. ఈ కాస్త పరిజ్ఞానం లేకుండా అప్‌కమింగ్ ఎమ్మెల్యేలం అంటూ నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం పట్ల ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కొంత మంది కాంగ్రెస్ వలస నాయకులు తమ ఉనికి కోసం గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. సాగర్-హైద్రాబాద్ రోడ్డు విస్తరణలో భాగంగా కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా బీటీ రోడ్డు వేసే పరిస్థితులు లేనందున ఆ ప్రాంతంలో సీసీ రోడ్లు వేసేందుకు నిర్ణయించామని ఇందుకు సంబంధించి త్వరలో టెండర్‌లను ఆహ్వానించనున్నామని చెప్పారు. ఈ విషయం తెలుసుకోకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బురదగుంట ముందు నిలబడి రోడ్డు బాగుచేయక పోతే ధర్నా చేస్తామంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. డిండి ఆయకట్టు కింద భూములకు సాగునీరు ఇవ్వాలని కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటే వారం రోజుల్లోగా డిండి ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని ఓ కాంగ్రెస్ నాయకుడు పత్రికలకు ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. సాగునీరు విడుదల చేస్తున్నందుకు ఆ నాయకుడు ఆందోళన చేస్తాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, టీఆర్‌ఎస్వీ నాయకులు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.

ఓటు చైతన్యంతోనే సామాజిక వర్గాల అభివృద్ధి
- ప్రజా గాయకుడు గద్దర్
ఆత్మకూర్ (ఎం), జూలై 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని, సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఓటు చైతన్యం ద్వారానే సాధ్యమవుతుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని పల్లెర్ల గ్రామంలో దివంగత సీపీఎం ఉద్యమకారుడు వేముల చల్లయ్య వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. నాటి ఆంధ్రా పాలకులకు నేటి తెలంగాణ పాలకులకు ఎలాంటి తేడా లేదని విమర్శించారు. ప్రజల చేతుల్లో పాలకులను వంచే వజ్రాయుధం ఓటు హక్కు అని, ఆ హక్కు ద్వారా దొరల పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నూటికి 93శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు ఐక్యమై దొరల పాలనకు చరమగీతం పాడాలన్నారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ పేదల సమస్యల కోసం సీపీఎం పోరాడుతుందని, చల్లయ్య ఆశయ సాధనకు ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారన్నారు. వేములకొండలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన కూలీల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేడి పాపయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాతూరి బాల్‌రాజుగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఏనుగు మనోరంజన్‌రెడ్డి, తిర్పంగి స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, మండల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, కట్ట గోవర్ధన్, పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్, నిజామాబాద్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు నూర్జహాన్, సదానందం, నోముల స్వామి, కిష్టారెడ్డి పాల్గొన్నారు.