చినబాబు విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, సయేషా సైగల్ జంటగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతలుగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చినబాబు’. ఈ సినిమా ఈనెల 13న విడుదలైంది.
ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో.. హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘మన ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుగారు సినిమా చూసి యూనిట్‌ను అభినందిస్తూ మెసేజ్ పోస్ట్‌చేయడం ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తి అలా అప్రిసియేట్ చేయడంవల్ల ఏ నమ్మకంతో ఈ సినిమా చేశామో అది ఇంకా పెరిగింది. ఆయన మమ్మల్ని ప్రశంసించడం గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ ఫ్యామిలీ ఎమోషన్స్ పెరిగిపోయాయి. చిన్న కుటుంబాలు పెరిగిపోతున్న ఈరోజుల్లో.. ఈ సినిమాచూసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పడం చాలా ఆనందంగా వుంది. చిన్నచిన్న ఊర్లో థియేటర్స్‌కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. అన్నయ్యతో కలిసి సినిమా చేశాను కాబట్టి ఈ సినిమా చాలా స్పెషల్‌గా భావిస్తున్నాను. అందరూ ఫ్యామిలీలతో కలిసి చూస్తున్నారు. ఇంత పెద్ద ఆనందాన్ని ఇచ్చిన ప్రేక్షకులను నేరుగా కలుసుకున్నాను’’అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. ‘‘సినిమాకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది. రైతు ఫ్యామిలీస్‌లోని రిలేషన్స్, ఉమ్మడి కుటుంబాల్లోని బంధాలు, బంధుత్వాలు గురించి ఆయన వ్యక్తిగతంగా ట్వీట్ చేశారు. తెలుగు, తమిళ నేటివిటీకి చాలా దగ్గరున్న సినిమా అని ఆయన చెప్పడం మాకు సంతోషంగా ఉంది. విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.