బిజినెస్

రూ. 77 దాటిన లీటర్ పెట్రోల్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధిక స్థాయిల వద్ద ఉండటం వల్ల దేశంలో గత రెండు నెలల కాలంలో తొలిసారి మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 77ను దాటింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం విడుదల చేసిన ధరల పట్టిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర తొమ్మిది పైసలు పెరిగి, రూ. 77.06కు చేరుకోగా, డీజిల్ ధర ఆరు పైసలు పెరిగి, రూ. 68.50కు చేరింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలు, అనేక రాష్ట్రాల రాజధాని నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే ఇంధన ధరలు చౌకగా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో అమ్మకం పన్ను, వ్యాట్ తక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం వల్ల జూలై 30 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తొమ్మిది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 88 పైసలు పెరిగింది. మే 29వ తేదీన లీటర్ పెట్రోల్ ధర ఆల్ టైమ్ హై రూ. 78.43కు చేరింది. ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. మే 29న లీటర్ డీజిల్ ధర కూడా ఆల్ టైమ్ హై రూ. 69.30కు పెరిగింది. ఢిల్లీలో జూన్ 9న లీటర్ పెట్రోల్ ధర రూ. 77 మార్కును దాటి రూ. 77.02కు చేరుకుంది. అదే రోజున లీటర్ డీజిల్ ధర రూ. 68.28కు చేరుకుంది.