బిజినెస్

దెబ్బతీసిన లాభాల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెండు రోజుల పాటు లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంధన, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఉదయం సెషన్ లావాదేవీలలో ఇంట్రా-డే రికార్డు స్థాయికి ఎగబాకినప్పటికీ, తరువాత దిగజారి క్రితం ముగింపుతో పోలిస్తే 26.09 పాయింట్ల (0.07 శాతం) దిగువన 37,665.80 పాయింట్ల వద్ద ముగిసింది. మదుపరులు ఇటీవల విలువ పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ వంటి సంస్థల షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మార్కెట్ లావాదేవీలలో ఊగిసలాట నెలకొంది. ఇదిలా ఉండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ వరుసగా మూడో రోజు తన పరుగు కొనసాగించి, 11,389.45 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం స్వల్పంగా 2.35 పాయింట్లు (0.02 శాతం) పుంజుకుంది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 11,428.95- 11,359.70 పాయింట్ల మధ్య కదలాడింది.
బీఎస్‌ఈ ఇండెక్స్‌లోని నష్టపోయిన ప్రధాన సంస్థల్లో టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్ ఉన్నాయి. వీటి విలువ 1.12 శాతం నుంచి 6.49 శాతం వరకు పడిపోయింది. ముఖ్యంగా సెనె్సక్స్ పడిపోవడానికి రిలయన్స్, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా నష్టపోయిన సంస్థల్లో అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, హిందుస్తాన్ పెట్రోలియం, బీపీసీఎల్, సిప్లా ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.55 శాతం నుంచి 6.08 శాతం వరకు పడిపోయింది.
‘మార్కెట్లు మంగళవారం సానుకూలంగానే ప్రారంభమయి, ఇంట్రా-డేలో సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. అయితే, రెండు పెద్ద కంపెనీల జూన్ త్రైమాసిక ఆదాయాలలో ఊహించిన స్థాయిలో వృద్ధి లేకపోవడం తరువాత మార్కెట్ సెంటిమెంట్‌ను స్వల్పంగా దెబ్బతీసింది’ అని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐఓ) వీరల్ బెరవాలా పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తొలి త్రైమాసిక ఫలితాలు వెలువడిన తరువాత ఆ బ్యాంకు షేర్ల విలువ 3.8 శాతం పడిపోయింది. అదాని పోర్ట్స్ ప్రత్యేక ఆర్థిక మండలి షేర్ల విలువ ఆరు శాతం పడిపోయింది. ఈ కంపెనీ తొలి త్రైమాసిక లాభం తొమ్మిది శాతం పడిపోవడంతో దీని షేర్ విలువ తగ్గింది.
మరోవైపు, సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్, ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, వేదాంత, మారుతి, యెస్ బ్యాంక్ షేర్ల విలువ 1.05 శాతం నుంచి 3.61 శాతం వరకు పెరిగింది.