రాష్ట్రీయం

ప్రతి రోజూ అగ్ని పరీక్షే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కక్షిదారుల వాదనలు వినడం, తీర్పు ఇవ్వడంలో న్యాయమూర్తులు, న్యాయాధికారులు నిత్యం సవాళ్లు ఎదుర్కొంటారని, వ్యవస్థలో ఉన్నవాళ్లకు ప్రతి రోజూ అగ్నిపరీక్షేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర స్ధాయి న్యాయాధికారుల మలి రోజు సదస్సులో మాట్లాడారు. న్యాయం ఎక్కడా అందని పరిస్థితుల్లో చివరిగా కక్షిదారులు కోర్టుల తలుపులు తడతారన్నారు. అలాంటి పరిస్ధితుల్లో కక్షిదారులకు న్యాయం అందించేందుకు ప్రయత్నించాలన్నారు. నీతి నిజాయితీతో పాటు నిష్పక్షపాతంతో న్యాయమూర్తులు నడుచుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, లోక్‌సభ, శాసనసభ్యులు ప్రజలకు చేసే సేవలపై ఐదేళ్లకోసారి ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. అలాగే చట్టసభల్లో అవిశ్వాస తీర్మానాన్ని కూడా పాలకపక్షం ఎదుర్కొంటుందన్నారు. అదే న్యాయ వ్యవస్ధలో న్యాయమూర్తులు, న్యాయాధికారులు పదవి విరమణ చేసేవరకు న్యాయం అందించడంపై నిత్యం వొత్తిడికి గురవుతూ బాధితులకు న్యాయం అందించేందుకు శ్రమిస్తారన్నారు. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు అంకితభావంతో పనిచేయాలన్నారు. న్యాయ స్థ్ధానాల్లో పెరిగిపోతున్న పెండింగ్ కేసులకు సత్వరమే పరిష్కారం లభించాలన్నారు. కేసుల పెండింగ్ వల్ల ప్రజలు ఇతర వ్యవస్ధలను ఆశ్రయించి న్యాయ సహాయం పొందేందుకు ప్రయత్నిస్తారన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలన్నారు. వివాహానికి సంబంధించి ఒక కేసు వివాదం వివిధ కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సంఘటనను ఉదహరించారు. కేసులను సత్వరమే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా న్యాయాధికారులు పనిచేయాలన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోస్లే మాట్లాడుతూ రాష్టస్థ్రాయ న్యాయాధికారుల సదస్సు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుందన్నారు. జిల్లా న్యాయాధికారుల సదస్సును ప్రతి ఏడాది నిర్వహిస్తామన్నారు. సదస్సులో జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ పి నవీన్‌రావు, జస్టిస్ ఎ రాజశేఖర రెడ్డి, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పాల్గొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సదస్సు ఆశయాలను వివరించారు. 900 మంది న్యాయాధికారులు సదస్సుకు హాజరయ్యారు.