జాతీయ వార్తలు

ఇదో హెచ్చరిక మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేరళ వరద విధ్వంసం కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించకుండా భవిష్యత్తులో మరిన్ని జల ప్రళయాలు తప్పవని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. కేరళలో రాబోయే విపత్తును సుమారు ఏడేళ్ల క్రితమే మాధవ్ గాడ్గిల్ ఊహించి, స్పష్టమైన ప్రతిపాదనలు చేసినప్పటికీ, అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. కేంద్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని ఫలితమే కేరళలో వరద బీభత్సం. ప్రముఖ పర్యావణ శాస్తవ్రేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ (డబ్ల్యూజీఈఈసీ) 2011 ఆగస్టు 31న కేరళ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. కేరళలో సున్నిత మండలాలు (ఈఎస్‌జెడ్)లను గుర్తించాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. పశ్చిమ కనుమల పరిధిలో సుమారు 1,40,000 చదరపు మైళ్ల విస్తీర్ణంగల ప్రాంతా న్ని ఈఎస్‌జెడ్‌గా ప్రకటించాలని, దీనిని మూడు జోన్లుగా విభజించాలని పేర్కొంది. ఈ ప్రాంతానికి చెందిన 142 మండలాలను ఈఎస్‌జెడ్ జోన్స్‌లో చేర్చాలంది. ఈఎస్‌జెడ్ ప్రాం తాల్లో గనులు, క్వారీల తవ్వకాల్ని నిషేధించాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టరాదని స్పష్టం చేసింది. నీటి ప్రాజెక్టులకు అనుమతించాదని రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వాలకు సుచించింది. పశ్చిమ కనుమల అథారిటీ (డబ్ల్యూజీఏ)ను ఏర్పాటు చేసి, దానికి సర్వాధికారాలు ఇవ్వాలని కోరింది. యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకోకపోతే, దారుణ ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.
హెచ్చరించిన రంగన్ కమిటీ
మాధవ్ గాడ్గిల్ నివేదికలోని అంశాలను పరిశీలించి, వాటి అమలు సాధ్యాసాధ్యాలను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటీ సైతం అలాంటి హెచ్చరికలే చేసింది. గాడ్గిల్ కమిటీ నివేదికలోని ప్రతి అంశం చాలా కీలకమైనదేనని, ఏ ఒక్కదానినీ విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, భవిష్యత్తు దారుణంగా ఉంటుందని తెలిపింది. కానీ, గాడ్గిల్ కమిటీ సూచనల మాదిరిగానే రంగన్ 2013లో ఇచ్చిన నివేదికను కూడా కేరళ సర్కారు బుట్టదాఖలు చేసింది. దాని ఫలితం కళ్ల ముందు కనిపిస్తున్నది. కేరళలో వరదలకు నాలుగు వందలకుపైగా మృతి చెందారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. లక్ష కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమయ్యాయి. 134 వంతెనలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. కేవలం రోడ్లు, వంతెనల నష్టమే 13,800 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. జల ప్రళయానికి కేరళ కనీసం రూ.లక్ష కోట్ల మేర నష్టపోయిందని అంటున్నారు. గాడ్గిల్, రంగన్ నివేదికలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని ఉంటే, ఇంత భారీ నష్టం జరిగి ఉండేదని కాదన్నది వాస్తవం.