జాతీయ వార్తలు

కేరళ జలవిలయానికి ఇదీ కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కేరళలో వరద బీభత్సం అంత తీవ్రంగా ఉండడానికి బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనానికి తోడు ఆగ్నేయ రుతుపవనాలే కారణమని నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షానికి ఇవే కారణమని వారు తేల్చారు. కోస్తా తీరంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో వందేళ్ల తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పది పదిహేను రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలతో నదులన్నీ నిండిపోయాయి. అధికారిక గణాంకాల ప్రకారం 223మంది చనిపోయారు. పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు నీటిపాలయ్యాయి. జూన్, జూలై నెలల్లో 15, 18 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 1-19 తేదీల మధ్య ఏకంగా 164 శాతం వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. స్కైమెట్ (వాతావరణ శాఖ) అధ్యక్షుడు జీపీ శర్మ దీనిపై మాట్లాడుతూ కొంకణ్ నుంచి కేరళ వరకూ పశ్చిమ కనుమలు విస్తరించాయన్నారు. ‘బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. మరొక ఉపరితల ఆవర్తనం. కేరళలో భారీ వర్షాలకు సోమాలి జెట్ ఫెనోమెనన్ కీలక ప్రభావం చూపింది. సోమాలి జెట్ స్ట్రీమ్స్ (గాలులు / ప్రవాహాలు) మడగాస్కర్‌లో పుట్టాయి. అవి మరింత తీవ్రమై పశ్చిమ కనుమలవైపు వచ్చాయి’ అని వెల్లడించారు. ఇవన్నీ కలిసి రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టించాయన్నారు. కొంకణ్ గోవా నుంచి కేరళ వరకూ తీరం వెంబడి అప్పటికే రుతుపవనాలు చరుగ్గా ఉండడంతో పరిస్థితి విషమించిందని మరో వాతావరణ శాఖ నిపుణుడు మహేష్ పల్వాత్ వెల్లడించారు. స్కైమెట్‌కు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వాతావరణ మార్పులు, రుతుపవనాల తీరుతెన్నులను అధ్యయనం చేసే ప్రైవేటు సంస్థ ‘స్కైమెట్’. అరేబియా సముద్రం మీదుగా వీచిన ఆగ్నేయ రుతుపవనాల ప్రభావం కేరళ, దక్షిణ కర్నాటకపై తీవ్రంగా పనిచేసిందన్నారు. అలాగే ఒడిశా తీరంలో ఆగస్టు 7, 13 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడినట్టు పల్లాత్ చెప్పారు. అల్పపీడనాలకు ఆగ్నేయ రుతుపవనాలు తోడవ్వడంతో భారీ వర్షాలు కురిశాయని భారత వాతావణ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు.