జాతీయ వార్తలు

పేదలకు మరో 1.12 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత పేదలకు మరో 1.12 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ పథకం కింద ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తారు. అందులో అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు 37 వేల ఇళ్లను కేటాయిస్తున్నట్టు హౌసింగ్, అర్బన్ మినిస్ట్రీ తెలియజేసింది. సెంట్రల్ శాంక్షన్, మానిటరింగ్ కమిటీ (సిఎస్‌ఎంసి) కమిటీ ఈ మేరకు సమావేశమై వీటిని మంజూరు చేసింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 55 లక్షల ఇళ్లకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. గత నెలలో ఈ కమిటీ పది రాష్ట్రాల్లో 2.67 లక్షల ఇళ్లకు అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు కొత్తగా మంజూరైన ఇళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు అధికంగా 37,717 ఇళ్లు, హర్యానాకు 19,958, మధ్యప్రదేశ్‌కు 18,375, మహారాష్టక్రు 12,238, ఛత్తీస్‌గఢ్‌కు 10,632, కర్నాటకకు 8,761, జమ్మూకాశ్మీర్‌కు 4,442, అరుణాచల్‌కు 188 ఇళ్లు మంజూరైనట్టు వివరించారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 1,683,18 కోట్లను సహాయంగా అందిస్తుంది. ఇప్పుడు కొత్తగా మంజూరైన 1.12 లక్షల ఇళ్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 54 లక్షల 95 వేల 443 ఇళ్లను మంజూరు చేసినట్టు కేంద్రం తెలియజేసింది.