తల్లి సెంటిమెంట్‌తో దేశంలో దొంగలు పడితే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రూపొందింది. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమాగౌతమ్ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక క్రైల్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. ఇటీవల సినిమా చూసిన అలీ బాగా నచ్చడంతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటానికి అంగీకరించారు. తమ్ముడికోసం ఆయన సమర్పించడం లేదు. సినిమా నచ్చి సమర్పిస్తున్నారు. మా టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. నేను బాగా చేశానని చెప్పడం కన్నా, ప్రేక్షకులు సినిమా చూసి చెప్తారని ఆశిస్తున్నాను. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్‌బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లింది. అది చాలా సంతోషం’ అని అన్నారు. ఖయ్యూమ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటిదాకా వంద సినిమాలు చేశాను. అందులో హీరోగానూ ఉన్నాయి. నాకంటూ ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది కదా.. అలాంటి సినిమా ఇది. కథ వినగానే నమ్మి చేశాను. టీమ్ అందరూ కష్టపడి పనిచేశారు. తల్లి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్‌లో చెప్పుకునే సినిమా అవుతుంది. తొలిసారి ఈ సినిమా చూసి మా అన్నయ్య నన్ను అప్రిషియేట్ చేశారు. సినిమా చాలా బాగా చేశార్రా బావుంది అని ఆయన అనడం మర్చిపోలేను’’ అని అన్నారు.
అలీ మాట్లాడుతూ.. ‘‘టి.కృష్ణగారి దర్శకత్వంలో దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా వచ్చింది. అప్పట్లో అందులో వేషం వేయడానికి నేను వెళ్లాను. నీ ఫేస్ చాలా కామెడీగా ఉంటుంది. చిన్నపిల్లాడివి. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు వద్దు..అని నన్ను పంపించేశారు. ‘‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆరోజే చెప్పారట. ఇప్పుడు దేశంలో దొంగలు పడ్డారు అని కృష్ణగారి టైటిల్‌తో మా తమ్ముడు ఓ సినిమా చేశాడు. ఈ సినిమాకు నా జేబునుంచి రూపాయి కూడా పెట్టలేదు. సినిమా చాలా బావుందనిపించింది. అందుకే సమర్పిస్తున్నాను. మా తమ్ముడు గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. కష్టాలు నేను పడ్డాను కానీ, వాడు పడలేదు. కానీ ఈ సినిమాకోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పనిచేశానని చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశాను. ట్విస్ట్‌లన్నీ చాలా బావున్నాయి. దర్శకుడిని చూస్తుంటే 30 ఏళ్ళకుముందు రామ్‌గోపాల్‌వర్మను చూసినటుట అనిపించింది అని అన్నారు.