నల్గొండ

పత్తి సాగుకు కళ్లెం! రైతు మేలు కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 22: రైతులకు ఆశలు చూపుతు యమపాశంలా మారుతున్న తెల్ల బంగారం పత్తి సాగుకు కళ్లెం వేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు సాగిస్తుంది. ఈ దఫా ఖరీఫ్‌లో ఎలాగైన పత్తి సాగును తగ్గించాలన్న సంకల్పంతో తగిన ముందస్తు ప్రణాళికలతో వ్యవసాయ శాఖ యంత్రాంగం సాగిస్తున్న వ్యూహారచన ఆసక్తి రేపుతుంది. దశాబ్ధాలుగా సాంప్రదాయ పంటల సాగుకు అలవాటు పడిన తెలంగాణ రైతాంగం గత కొన్నాళ్లుగా వాణిజ్య పంట పత్తి సాగువైపు మళ్లినప్పటి నుండి ఆర్ధిక కష్టాలు, ఆత్మహత్యల పర్వంలో సాగుతు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రైతుల ఆత్మహత్యలకు ప్రధానంగా పత్తి పంటల సాగు బలమైన కారణంగా ఉంటుండం, పత్తి రైతులే ఎక్కువగా ఆత్మహత్యల బారిన పడుతుండటం వంటి పరిణామాలతో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలన్న నూతన లక్ష్యాల నేఫధ్యంలో పత్తి సాగును నియంత్రించాలన్న డిమాండ్ పెరిగిపోయింది.
10లక్షల ఎకరాల తగ్గింపు లక్ష్యం..!
తెలంగాణలో అన్ని రకాల పంటల సాగు 89లక్షల 90వేల ఎకరాలుగా ఉండగా అందులో కేవలం పత్తి సాగు 42లక్షల 42వేల ఎకరాలుగా ఉండటం గమనార్హం. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 3లక్షల 500హెక్టార్లలో పత్తి సాగవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పత్తి సాగు చేస్తు అధిక సాగు వ్యయంతో పాటు తగిన మద్ధతు ధర లభించక పోవడం, వర్షాభావంతో దిగుబడులు పడిపోతుండం వంటి వాటితో నష్టపోతున్న రైతులు అప్పుల పాలవుతు ఆత్మహత్యల దిశగా సాగుతున్నారు. అటు ఆహార పంటల సాగు సైతం ఆశించిన స్థాయిలో పెరుగడం లేదు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పత్తి ఎగుమతులు నానాటికి పడిపోతుండటం, ఎక్సైజ్ సుంకం పెరుగడం, మద్ధతు ధర 3500వరకే లభిస్తుండటం వంటి పరిణామాలు సైతం పత్తి రైతులను మరింత నష్టపరుస్తున్నాయి. ఈ నేపధ్యంలో రైతు బాగు కోసం ప్రజాహితం కోసం పత్తి సాగును ఈ ఏడాది 10లక్షల ఎకరాల మేరకు తగ్గించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పత్తికి క్వింటాల్‌కు 3100నుండి 3500వరకు ధర మాత్రమే లభిస్తుండగా కంది వంటి పప్పు ధాన్యాలకు కనీసంగా క్వింటాల్‌కు 10నుండి 13వేల వరకు మద్ధతు ధర లభిస్తుంది. ఈ నేపధ్యంలో పప్పు ధాన్యాలు, కందులు, మొక్కజొన్న, సోయాబిన్ వంటి పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తు రైతుల్లో చైతన్యం కల్పించేందుకు, విత్తన సబ్సిడీని సైతం అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు సాగిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలతో పాటు పప్పు ధాన్యాల సాగుతో లాభాలపై రైతాంగంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందే విస్తృత ప్రచారం సాగించాలని వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతుండగా ఈ ప్రయత్నాలు ఎంతవరకు పత్తి సాగును నియంత్రిస్తాయన్నదీ మునుముందు తేలనుంది.