నెల్లూరు

73 అక్రమ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 22: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కొత్తకాలవ సెంటర్‌లో అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 73 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు కొత్తకాలవ సెంటర్‌కు చెందిన షాన్‌వాజ్ గత కొంతకాలంగా ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా చిన్నచిన్న సిలిండర్లలోకి రీఫిలింగ్ చేస్తుంటాడు. తమకు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్‌పి రమేషయ్య ఆదేశాలకు అనుగుణంగా సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 73 ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్లను గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆరుగురికి గాయాలు
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 22: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలైన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రేబాల గ్రామ పరిథిలో గల పల్లెపాళెంలో సోమవారం జరిగిన ఓ శుభకార్యం నిమిత్తం అత్తిపాటి పెంచలమ్మ ఇంటికి సంగం మండలం అన్నారెడ్డిపాళెం పల్లెపాళెంకు చెందిన ఆమె అల్లుడు మనబాక పెంచలయ్య భార్యతో కలసి వచ్చాడు. పెంచలయ్య భార్యను ఆమె పుట్టింటిలో వదిలి అతిగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్యతో గొడవ పడుతూ ఆమెను కాలితో కడుపులో తన్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిని మందలించి అక్కడి నుండి పంపించేశారు. మంగళవారం 2 గంటల సమయంలో అత్తిపాటి పెంచలమ్మ కుటుంబ సభ్యులు ఆటోలో సంగం వైపు వెళుతుండగా మనబాక పెంచలయ్య, అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బుచ్చిరెడ్డిపాళెం రాఘవరెడ్డి కాలనీ వద్ద కాపుకాచి ఆటోను అడ్డగించి కర్రలు, కత్తులతో అకస్మాత్తుగా దాడికి దిగారు. ఈ సంఘటనలో ఇరువర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో అత్తిపాటి పెంచలయ్య, అత్తిపాటి శంకరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.