అమర్ అక్బర్ వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రవితేజ మూడు భిన్నమైన షేడ్స్‌లో కనిపించే ఈ సినిమాలో గ్లామర్ గర్ల్‌గా ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో అది జనాలకు బాగానచ్చేసింది. దాంతో దర్శక నిర్మాతలు ఇంకాస్త ఉత్సాహంతో సినిమాను పూర్తిచేసే పనుల్లో బిజీగామారారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆరోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదట? కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను డిసెంబర్ 14కు వాయిదా వేసినట్టు టాక్. ఒక్కసారిగా ఈ సినిమాను రెండు నెలలపాటు ఎందుకు వాయిదా వేశారన్న విషయం సంచలనం రేపుతోంది. అయితే దానికి కారణం దసరాకు పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాను వాయిదా వేసినట్టు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.