మహబూబ్‌నగర్

రానున్న రోజుల్లో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 18: సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తూ చట్టపరిధిలో నిచ్చక్కిగా వ్యవహరిస్తూ రానున్న కాలంలో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో శాంతిభద్రతల సమీక్ష సమావేశంలో సిబ్బందికి సూచనలు, సలహాలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ సంఘ వ్యతిరేక శక్తులను చట్టపరిధిలో నిదక్షిణంగా అణచివేస్తామనే సంకేతం పోలీసులు ఇవ్వడం వల్ల సమాజానికి పోలీసులపై సమ్మకం కలుగుతుందని అన్నారు. జిల్లాలో 30పోలీస్ యాక్టు ఆమలులో ఉన్న విషయం తెలుపుతూ ఈ చట్టం ఆమలుకై గట్టిగా పనిచేయాలని ఆమె సిబ్బందికి సూచించింది. వినాయక చవితి వేడుకల్లో పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమర్జనం చేసుకోవాలని, ముఖ్యంగా డిజెలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదనే విషయం స్పష్టంగా తెలియజేశారు. ఎవరైన డిజెలు వినియోగించే ప్రయత్నం చేస్తే వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వద్దంతులు వ్యాప్తి చేసే వ్యక్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి పట్ల తగిన దండన ఉంటుందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని గ్రామాల్లో స్థానిక పోలీసు అధికారులు సర్వే నిర్వహించి గొడవలు సృష్టించేవారిపై హెచ్చరికలు జారీ చేయాలని కోరారు. ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే పోలీసులు ఎల్లవేళలా ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీలు గిరిబాబు, శ్రీ్ధర్, సాయిమనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ పరీక్షల్లో అవకతవకలకు తావులేదు
ఈ నెల 30వ తేదిన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రిలిమినరీ రాత పరీక్షను దృష్టిలో ఉంచుకుని మంగళవారం జడ్పీ మీటీంగ్ హల్‌లో పరీక్ష నిర్వహించే అధికారులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూసే భాద్యత అధికారులపై ఉందని అన్నారు.

కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం
కోస్గి, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సముచితస్థానం కల్పించడంతో పాటు ప్రజాసంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి పట్టణంలోని నాగులపల్లి ప్రతాప్‌రెడ్డి రైస్‌మిల్లులో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను పొరుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో సైతం వాడుకున్నారని, ఈ సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాల మంత్రులు, మేధావులు తెలుపుకొని ప్రశంసించారని ఆయన తెలిపారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుపెట్టుబడి, రైతుభీమా పథకాలను తెలంగాణాలో సమర్థవంతంగా అమలుచేస్తూ నిరంతరం రైతు అభివృద్ధికి టీఆర్‌ఎస్ పాటుపడుతున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రైతులనే కాకుండా అన్ని వర్గాల వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన అన్నారు. అలాగే తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీ, బీజేపీ పార్టీలకు ఓటు అడిగే హక్కు కూడా లేదని, ఆ పార్టీలలో గ్రూపు తగాదాలతో నిత్యం వాళ్ళలో వాళ్లకే స్వేచ్చలేదని ఇక ప్రజా అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సహకారంతో కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చారని, కావున నియోజకవర్గ ప్రజలు నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కోడంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాసంక్షేమమం కోసం ఆవిర్భవించిన పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు.