క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. యర్రగుంట్ల మండలానికి చెందిన గంగరాజు, దానమయ్య ప్రొద్దుటూరు పట్టణ శివారులోని ఆర్టీపీపీ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా మరో మోటార్ సైకిల్‌పై వచ్చిన నారాయణ, నాగసుబ్బయ్య ఢీకొన్నారు. దీంతో గంగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఓబులేసు తెలిపారు.