నల్గొండ

హస్త కళలను ఆదరించాలి: గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్: భారత దేశ సంస్కృతి, సాంప్రదాయల మేళవింపుకు, కళకారుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచే హస్తకళలను ప్రజలు ఆదరించి భారతీయ చేనేత, హస్త కళలను బతికించాలని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శివాజీనగర్‌లోని టిటిడి కల్యాణ మండపంలో కళాభారతీ చేనేత, హస్త కళ మేళను ఆయన ప్రారంభించి మాట్లాడుతు దేశీయ చేనేత, హస్త కళలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయన్నారు. అటువంటి చేనేత, హస్త కళా ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత చేనేత వస్త్ర ఉత్పత్తులను, కళంకారి, ఖాదీ వస్త్రాలను, కొండపల్లి బొమ్మలను ఇతర చేనేత, హస్త కళా వస్తువులను ఆయన తిలకించి కళాకారుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. కళాభారతీ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జెల్లా సత్యనారాయణ, ఆర్.ప్రసాద్‌రావులు మాట్లాడుతు పట్టణ ప్రజల కోసం ఏప్రిల్ 7వ తేది వరకు చేనేత, హస్త కళా మేళా కొనసాగుతుందన్నారు.