బిజినెస్

మండే ఎండల్లోనూ తగ్గని బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 25: వేసవి ప్రారంభంలోనే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు గ్రీష్మతాపాన్ని భరిస్తూనే సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన దిశగా కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60.03 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తున్నారు. సంస్థ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ప్రోత్సాహక పథకాల ప్రభావం కూడా అనుకూల ఫలితాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి ముగిసే నాటికి 54.33 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సంస్థ సాధించింది.