ఆంధ్రప్రదేశ్
సవాళ్లను అధిగమిస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 October 2018
అమరావతి, సెప్టెంబర్ 30: ‘కొత్త రాష్ట్రం. ఇబ్బందులు, సవాళ్లు అనేకం ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో సవాళ్లను అధిగమిస్తాం’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. ఆదివారం సచివాలయంలోని సీఎస్ చాంబర్లో ప్రస్తుత సీఎస్ దినేష్‌కుమార్ నుంచి నూతన సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1984 ఐఏఎస్ కేడర్‌కు చెందిన పునేఠా తొలుత రాజంపేట సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా, వివిధ విభాగాలకు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పయనించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని చెప్పారు.