మరో వారసుడి ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ అవార్డు గ్రహీతగా, విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న బహుభాషా నటుడు నాజర్. తమిళ, తెలుగు సినిమాల్లో ఇప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ ఆర్టిస్ట్. ఇపుడు నాజర్ వారసుడు తమిళంలో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడు కూడా సినిమాల్లోనే ఉన్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం నాజర్ చిన్న కుమారుడు అబీ మెహిదీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. తన మొదటి సినిమాని తమిళంలో చేస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయిందని తెలుస్తోంది. నవంబర్‌లో చిత్రం షూటింగ్ మొదలవుతుందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.