విశాఖపట్నం

ఐరాస ప్రయత్నాలను శంకించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిరత, శాంతి స్థాపనకు చేస్తున్న కృషిని శంకించరాదని ఐరాస మాజీ కార్యదర్శి కిషోర్ మాంథ్యన్ అన్నారు. శనివారం గీతంలో టెడెక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న భిన్న రంగాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయ వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మాంధ్యన్ మాట్లాడుతూ ఐరాసలో 194 దేశాల సభ్యత్వం ఉందన్నారు. ఇప్పటి వరకు రసాయనిక ఆయుధాలను వాడుతున్న వాటిని నిరోధించడం, అణుపరీక్షలకు శాంతియుత ప్రయత్నాలకు మాత్రమే వాడే విధంగా ఆయా దేశాలపై వత్తిడి తీసుకురావడం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆవిర్భావం వంటివి, కాంబోడియా, మొజాంబిక్‌లలో శాంతి స్థాపనకు ఐరాస చేసిన కృషిని వివరించారు. భారతీయ చలనచిత్రాల గురించి అజిత సుచిత్ర వీణా మాట్లాడుతూ భారత్ గర్వించదగ్గ చలన చిత్ర దర్శకుడు సత్యజిత్ రే అన్నారు. మంచి చిత్రాలను తీయడానికి కోట్లాది రూపాయల వ్యయం చేయాల్సిన అవసరం లేదని, ఐదు లక్షలతో కూడా సినిమాలు నిర్మించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రామకృష్ణన్ మాట్లాడుతూ క్రీడాకారులు మెరుగైన ఆట తీరును కనబరిచేందుకు కోచ్‌ల సాయం, నిరంతర సాధనతోపాటు టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుందని గురించి తాను చేసిన ప్రయత్నం ఎందరో క్రీడాకారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా యానిమేషన్‌పై సురేష్ ఎరియత్, పారిశ్రామికవేత్త అనుభవ్ పదాన్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.