క్రీడాభూమి

2019 వరల్డ్ కప్‌కు మలింగ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక, అక్టోబర్ 15: శ్రీలంక క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ లసిత్ మలింగ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు దాదాపు లేనట్టే. ఏడాది కాలం తర్వాత ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న మలింగ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఆసియా కప్‌లో శ్రీలంక గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న మలింగ ఆడిన రెండు మ్యా చ్‌లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం వరల్డ్ టూర్‌కు అతడిని తీసుకునే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్టేనని తెలుస్తోంది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 44 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా రాణించినా వరల్డ్ కప్ లో అవకాశాలు దొరకడం దుర్లభమేనని తెలుస్తోంది. అయితే, వచ్చే ఏడాది వరల్డ్ కప్‌లో చాన్స్ వస్తుందనే విశ్వసిస్తున్నానని అంటున్న మలింగ బహుశా ఇదే ఇదే తనకు చివరి వరల్డ్ కప్ కావచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ఏడాది విరామం తర్వాత మళ్లీ ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లలోకి అడుగుపెట్టాను. నేను ఒక ఆటగాడిని. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నా విధి, కర్తవ్యం. జట్టులో చోటు దక్కకపోయినపుడు కూడా కెనడా టూర్‌కు వెళ్లాను. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని అత్యధికంగా వికెట్లు తీసుకున్నాను. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ చాన్స్ వచ్చే ఆడతాను. క్రీడా జీవితంలో చివరి దశకు చేరుకున్నాను’ అని వ్యాఖ్యానించాడు.