క్రీడాభూమి

డ్రగ్ టెస్టు నోటీసుపై బోల్ట్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 15: డ్రగ్ టెస్టుకు సంబంధించి నోటీసు రావడంతో ప్రపంచ ప్రఖ్యాత పరుగుల దిగ్గజం ఉసేన్ బోల్ట్ ఒకపక్క ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే మరోపక్క తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అథ్లెటిక్స్ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నా, అథ్లెటిక్స్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందాలు లేనప్పటికీ తనకు డ్రగ్ టెస్టుకు సంబంధించిన నోటీసు అందజేయడంలో ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్యానించాడు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన బోల్ట్ కొనే్నళ్లుగా కొనసాగుతున్న అథ్లెటిక్స్ నుంచి గత ఏడాది తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఫుట్‌బాల్ ఆటగాడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా సెంట్రల్ కోస్ట్ మారినర్స్ నుంచి తగిన డీల్ కుదరకపోవడంతో అథ్లెటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ‘కుర్రాళ్లూ..నేను ట్రాక్ అండ్ ఫీల్డ్ నుంచి రిటైరయ్యాను. ఫుట్‌బాల్ ఆటగాడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాను ఇదుగో చూడండి..’ అంటూ డ్రగ్ టెస్టుకు సంబంధించిన అందిన నోటీసును సైతం సోమవారం ఇన్‌స్టాగ్రాం వీడియో ద్వారా ప్రదర్శిస్తూ పేర్కొన్నాడు. మూత్రం, రక్త పరీక్షలకు సిద్ధం కావాలని బోల్ట్‌కు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో బోల్ట్ మాట్లాడుతూ ‘నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని కాను. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్ టెస్టుకు రమ్మంటే ఎలా? నేను ఇంతవరకు ఏ క్లబ్ తరఫున సంతకం చేయలేదు. అలాంటపుడు డ్రగ్ టెస్టు ఎలా సిద్ధం కావాలి?’ అని ప్రశ్నించాడు. కాగా, ఆస్ట్రేలియా స్పోర్ట్స్ యాంటీ డోపింగ్ అథారిటీ గైడ్‌లైన్స్ ప్రకారం క్రీడాపోటీల్లో పాల్గొనే ఎవరికైనా డోపింగ్ పరీక్షలు తప్పనిసరి అని ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.